ఇంగ్లీషులో మీరు ఎందుకు మాట్లాడ లేక పోతున్నారు?
Why are you unable to speak English?
🇮🇳 ఉద్యోగాల కోసం జరిగిన కొన్ని ఇంటర్వ్యూలను మేము అబ్జర్వ్ చేసినప్పుడు కనీసం వారి గురించి వారు ఐదు నిమిషాలపాటు ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నారు. మీరే ఆలోచించండి.
🇮🇳 When we observed some interviews for jobs they could not speak English for at least five minutes about them. Think for yourself.
🇮🇳 మీ గురించి మీరు అరగంటసేపు మాట్లాడడానికి మీరు ఐదో తరగతి చదివితే సరిపోతుంది. మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడీ ఎంఈడీ చదవక్కరలేదు.
🇮🇳 If you read fifth grade it is enough for you to talk about yourself for half an hour. You do not want to study Tenth, Inter, Degree, PG, B.ED, MED etc...
🇮🇳 అందుకే మీరు గానీ ఎవరిచేతనైనా గానీ మీ గురించి మీ స్టడీస్ గురించి మీ స్కిల్స్ గురించి మీ కుటుంబం గురించి ఒక రెండు పేజీలు ఇంగ్లీషులో రాయించుకుని ప్రాక్టీస్ చేయండి.
🇮🇳 That is why you or anyone else should write a couple of pages in English about your studies, your skills, your family and practice.
🇮🇳 మీరు ఖచ్చితంగా చక్కగా అనర్గళంగా ధారాళంగా ఇంగ్లీషులో మాట్లాడ గలుగుతారు.
You will definitely be able to speak English elequently and fluently.
🇮🇳 ఇక ఎదుటివారు మాట్లాడింది అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ కింది పనులు చేయాలి.
🇮🇳 You must do the following if you want to understand what others are saying.
ఇంగ్లీష్ లో అన్ని రకాల ప్రశ్నలను అడగటం నేర్చుకోవాలి.
Learn to ask all kinds of questions in English.
అన్ని గ్రామర్ టాపిక్స్ వచ్చినా రాకపోయినా వాటిని అర్థం చేసుకోగలగాలి.
Be able to understand all the grammar topics whether they come or not.
అన్ని గ్రామర్ టాపిక్స్ లోనూ వచ్చే కొన్ని రకాల సెంటెన్స్ లను మీరు అప్పుడప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి.
You should occasionally memorize certain types of sentences that come in all grammar topics.
మోరల్ స్టోరీస్ ని లెటర్స్ ని తరచూ చదువుతూ ఉండాలి.
Moral Stories Letters should be read frequently.
రేడియోలోనూ టీవీలోనూ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ని బాగా ఫాలో అవుతూ ఉండాలి.
English news channels should be well followed on radio and TV.
ఇంగ్లీష్ మూవీస్ చూడాలి.
Must watch English movies.
తెలుగు మూవీస్ ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూస్తే బాగా ఉపయోగం ఉంటుంది.
It is very useful to watch Telugu movies with English subtitles.
మీరు ఇంగ్లీష్ వాతావరణంలో తరచుగా గడుపుతూ ఉండాలి.
You should be living in an English environment often.
మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లో తప్పులు దొర్లుతున్నాయి ఏమోనని భయపడకూడదు.
Don’t be afraid of what is going wrong in English when speaking
ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి కానీ మీకు ఎలాగైనా ఇంగ్లీషులో చక్కగా మాట్లాడాలి అనే తపన ఉండాలి, ఉంటే మీకు అదే వస్తుంది.
There are many more to say but you should have the quest to speak English well anyway, if you get the same.
అవకాశాలు అనంతం.
Opportunities are infinite.
మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అనంతమైన కోరికను కలిగి ఉండాలి.
You ought to have the infinite burning desire for learning English.
శుభం.
Good luck.
No comments:
Post a Comment